Exports of Andhra Pradesh: ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం నుండి జరుగుతున్న ఎగుమతులను ప్రోత్సహించే విధంగా ప్రణాళికలు రచిస్తుంది..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం నుండి జరుగుతున్న ఎగుమతులను ప్రోత్సహించే విధంగా ప్రణాళికలు రచిస్తుంది. ఇప్పటికే రాష్ట్రం ఎగుమతులతో 6 వ స్థానం లో ఉంది. గతసంవత్సరం (2021-22) రాష్ట్రము నుండి ప్రపంచం లోని వివిధ దేశాలకు రూ. 1.43 లక్షల కోట్ల రూపాయల ఎగుమతులు జరుగగా ఈ ఆర్ధిక సంవత్సరంలో (2022-23) 1.59 లక్షల కోట్ల రూపాయల ఎగుమతులు జరిగి రాష్ట్రం 6 వ స్థానానికి ఎగబ్రాకింది.
ఇది ఇలా ఉండగా ,కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన District as Export Hub పధకంలో భాగంగా రాష్ట్రము లోని అన్ని జిల్లాలలో ఎగుమతులకు అనుకూలం గా ఉన్న ఉత్పత్తులను ఎంపిక చేసి, ఆయా ఉత్పత్తుల ఎగుమతి దారులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి నుంచి సమాచారం సేకరించి రానున్న 5 సం. లలో ఎగుమతులు రెట్టింపు చేయడానికి ప్రతి జిల్లాకు ఒక ఎగుమతుల కార్యాచరణ ప్రణాళికను తయారుచేయనున్నారు.
ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తొలి విడత జాబితాలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి విశాఖపట్నం, తూర్పు గోదావరి మరియు గుంటూరు జిల్లాలు ఉండగా ఈ మూడు జిల్లాల ఎగుమతుల కార్యాచరణ ప్రణాళికలు (District Export Action Plan) తయారుచేసి కేంద్ర ప్రభుత్వానికి తదుపరి ఆమోదం కొరకు పంపించియున్నారు. మిగిలిన 23 జిల్లాల ఎగుమతుల కార్యాచరణ ప్రణాళికల తయారీ వివిధ దశలలో ఉన్నాయి. రాష్ట్రములో ఎగుమతుల ప్రోత్సాహంలోభాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన "రాష్ట్ర ఎగుమతుల విధానం (APEX POLICY 2022-27 ) " లో వివిధ రాయితీలు ప్రకటించింది.
ఎగుమతుల పాలసీలో అందించే ప్రోత్సాహకాల సారాంశం ఈ విధంగా ఉంది:
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నుండి ఎగుమతి అయిన ముఖ్యమైన 10 ప్రధాన వస్తువుల జాబితా ఈ విధంగా ఉంది:
2013-14 నుండి 2022-23 వరకు జరిగిన ఎగుమతి వివరాలు (గత 10 సంవత్సరాలు)
(*DGCIS వారు జారీ చేసిన గణాంకాలు; 2013 - 14 సం. వరకు అవిభాజ్య రాష్ట్ర గణాంకాలు)
ఎగుమతుల సంసిద్ధత సూచిక (EPI ): ఇది కాక ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నీతి ఆయోగ్ విడుదల చేసే వివిధ రాష్ట్రాల ఎగుమతుల సంసిద్ధత సూచికలో (Export Preparedness Index-EPI) 2020 సంవత్సరంలో 20 వ స్థానం లో ఉండగా, 2021 సం. లో 9 వ స్థానానికి, 2022 సం. లో 8 వ స్థానానికి ఎగబ్రాకింది. 2023 సం. సూచిక ఇంకా ప్రకటించవలసి ఉంది.