అదిగో.. పులి.. రూటు మార్చింది
దాదాపు ఐదు వారాలుగా కాకినాడ జిల్లాలో బెంగాల్ టైగర్ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది
దాదాపు ఐదు వారాలుగా కాకినాడ జిల్లాలో బెంగాల్ టైగర్ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. బోనుకు చిక్కకుండా, కెమెరాల కంటపడకుండా తప్పించుకుంటంది. విడతల వారీగా అది స్థలాలు మారుస్తుండటంతో అటవీ శాఖ అధికారులు కూడా హైరానా పడుతున్నారు. ప్రస్తుతం తాజాగా పులి తుని ప్రాంతంలో సంచరిస్తుంది. తునికి సమీపంోని కుమ్మరిలోవ కాలనీ వద్ద పులి రోడ్డు దాటుతుండగా స్థానికులు గమనించి అటవీ శాఖ అధికారులకు తెలిపారు.
తుని ప్రాంతంలో...
దీంతో ప్రత్తిపాడు ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోనులను తిరిగి తుని ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తుని ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలను కనుగొన్నారు. రౌతులపూడి అటవీ ప్రాంతం నుంచి తునిలోకి పులి వచ్చిందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల వైపు రాకపోకలను అధికారులను నిలిపేశారు. ముచ్చెర్లకొండపై ఉంటుందన్న అనుమానంతో అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. కానీ 36 రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న పులిని పట్టుకోవడం అటవీశాఖ అధికారులకు సవాల్ గా మారింది.