Andhra Pradesh : ఏబీకి గుడ్ న్యూస్... ఈరోజు జాయినింగ్.. ఈరోజే రిటైర్‌మెంట్
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం సర్వీసులోకి తీసుకుంది
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం సర్వీసులోకి తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో ఆయనను సర్వీసులోకి తీసుకోవడానికి సంసిద్ధతను వ్యక్తిం చేసింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావుపై రెండు సార్లు ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో సస్పెండ్ చేసింది.
క్యాట్ ఆదేశాలతో...
అయితే కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఆయనను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. అయితే కేంద్ర హోం శాఖ ఆయనపై నమోదయిన కేసును విచారించాలని భావించడంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టులో ఏబీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా తీర్పు రావడంతో ఆయనను నేడు విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. అయితే ఈరోజు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అలా విధుల్లో చేరి ఇలా పదవీ విరమణ చేయాల్సి వస్తుంది.