Ramoji Rao : రామోజీ మృతి పట్ల జగన్ దిగ్భ్రాంతి
రామోజీరావు మృతి తనకు దిగ్భ్రాంతి కలిగించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు;
రామోజీరావు మృతి తనకు దిగ్భ్రాంతి కలిగించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. రామోజీరావు కుటుంబానికి సంతాపాన్ని ప్రకటించారు. రామోజీరావు ఆత్మకు శాంతి కలగాలని జగన్ ఆకాంక్షించారు. జర్నలిజంలో రామోజీరావు చేసిన సేవలను కొనియాడారు.
ఫిలింసిటీలో...
రామోజీరావు పార్ధీవ దేహాన్ని ఫిలింసిటీకి తరలించారు.అక్కడ ఆయన నివాసంలో ఉంచారు. ప్రముఖుల సందర్శనార్ధం అక్కడే ఉంచుతారు. రామోజీ ఫిలిం సిటీలోనే అంత్యక్రియలు కూడా జరగనున్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇప్పుడే అనేక మంది ప్రముఖులు రామోజీ ఫిలింసిటీకి వచ్చి ఆయన పార్ధీవ దేహానికి నివాళులర్పిస్తున్నారు. ఆయన పార్ధీవ దేహానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.