Tirumala : టీటీడీ కీలక నిర్ణయం.. ఆ టిక్కెట్లు రద్దు
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.;
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అలిపిరిలో శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆఫ్ లైన్ టికెట్లు 10 రోజుల పాటు రద్దు చేస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు అలిపిరిలో శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆఫ్ లైన్ టికెట్లను రద్దు చేస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది.
భక్తులు సహకరించాలని...
భక్తుల సౌకర్యార్థం తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని టిటిడి విజ్ఞప్తి చేసింది. రెండు రోజుల క్రితం తిరుపతిలో జరిగిన ఘటనతో తిరుపతిలో టిక్కెట్లు ఇచ్చే విధానంపై పాలకమండలి సమీక్ష చేయనుంది. ఇకపై ఆన్ లైన్ లోనో, నేరుగా తిరుమలలోనూ టిక్కెట్లు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.