Pawan Kalyan : నేడు పిఠాపురానికి పవన్.. ఆ రోడ్డు నుంచే

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు;

Update: 2025-01-10 02:38 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈరోజు పిఠాపురం చేరుకుని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈరోజు పిఠాపురంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం నిధులతో నిర్మించిన మినీ గోకులాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,500 గోకులాలను ప్రారంభించనున్నారు. ఇక ఈరోజు పిఠాపురంలోని మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సంప్రదాయ సంక్రాంతి వేడుకలను ప్రారంభించనున్నారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లను ఆయన పరిశీలించనున్నారు.

సంక్రాంతి వేడుకల్లోనూ...
సంక్రాంతి వేడుకల్లోనూ పవన్ కల్యాణ్ పాల్గొంటారు. దీంతో పాటు గొల్లప్రోలు తహసిల్దార్ కార్యాలయంతో పాటు అనేక ప్రారంభోత్సవాలను నేడు పవన్ కల్యాణ్ చేయనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. కాగా రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి పిఠాపురం రోడ్డు మార్గంలో బయలుదేరనున్నారు. ఏడీబీ రోడ్డులో ఆయన ప్రయాణించనున్నారు. ఇటీవల ఏడీబీ రోడ్డులో ప్రమాదం జరిగి గేమ్ ఛేంజర్ ఈవెంట్ నుంచి వస్తూ ఇద్దరు యువకులు మరణించడంతో పవన్ కల్యాణ్ ఈ రోడ్డు ప్రయాణించాలని పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.


Tags:    

Similar News