Ys Jagan : చంద్రబాబు సేవలోనే పోలీసులు.. జగన్ సంచలన వ్యాఖ్యలు

తిరుపతిలో ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ జరగలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు;

Update: 2025-01-09 14:14 GMT

తిరుపతిలో ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ జరగలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఆయన ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి జరుపుకుంటామని, ఆరోజుల్లో కొన్ని లక్షల మంది స్వామి వారి దర్శనానికి వస్తారని, పుణ్యం కోసమే భక్తులు తిరుమలకు వస్తారని అందరికీ తెలుసునని జగన్ అన్నారు. ఇంత మంది తిరుమల తిరుపతి దేవస్థానం టోకెన్లు ఇచ్చే కౌంటర్ల వద్ద సరైన భద్రతను పాటించలేదని జగన్ ప్రశ్నించారు.

కుప్పం పర్యటనకు వెళ్లిన పోలీసులు...
టీటీ ఛైర్మన్, ఈవో, ఎస్సీ, జేఈవోలు అందరూ భాగస్వామ్యులేనని జగన్ అన్నారు. పదోతేదీన వైకుంఠ ఏకాదశి అని చంద్రబాబుకు తెలుసునని, ఆయన మొన్న కుప్పం వచ్చి మూడు రోజులు ఉండి వచ్చి వెళ్లారు కానీ, కనీసం దీనిపై ఎందుకు చంద్రబాబు సమీక్షించలేదని జగన్ ప్రశ్నించారు. లక్షల మంది వస్తారని తెలిసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని తెలియదా? అని నిలదీశారు. పోలీసులందరినీ చంద్రబాబు పర్యటన కోసం కుప్పం పంపించారని, ఇక్కడ పోలీసులు ఎవరూ లేకపోవడం వల్లనే తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించారని జగన్ అన్నారు.


Tags:    

Similar News