Ys Jagan : తిరుపతిలో బాధితులను పరామర్శించిన జగన్

Update: 2025-01-09 13:20 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుపతికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కోసం వచ్చితొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. క్షతగాత్రులను అడిగి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు.

తొక్కిసలాటపై...
తొక్కిసలాట ఎలా జరిగింది? అన్న దానిపై కూడా జగన్ బాధితులను అడుగుతున్నారు. అదే సమయంలో వారికి అందుతున్న వైద్య సేవలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. సరైన వైద్యం అందుతుందా? అన్నది బాధితుల బంధువులను అడిగి వైఎస్ జగన్ తెలుసుకుంటున్నారు. జగన్ ఆసుపత్రికి రావడంతో పెద్దసంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు.


Tags:    

Similar News