సీబీఐ విచారణ ఎందుకు కోరలేదు?

మాజీ మంత్రి పేర్ని నాని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు

Update: 2023-02-11 12:17 GMT

మాజీ మంత్రి పేర్ని నాని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషపు రాతలతో ఒక పుస్తకం అచ్చు వేయించి దానిపై తన పేరును వేసుకోలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అచ్చెన్నాయుడికి బుర్ర తప్ప బాడీ పెరగలేదన్నారు. చంద్రబాబు హయాంలోనే వివేకానందరెడ్డి హత్య జరిగిందని, వివేకా కూతురు స్టేట్‌మెంట్ ను ఎందుకు తీసుకోలేదని నాని ప్రశ్నించారు. భార్య, అల్లుడిని ఎందుకు విచారించలేదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఎందుకు ఆ హత్యపై ఛార్జిషీటు వేయలేకపోయారని నిలదీశారు.

ఎన్టీఆర్ మరణంపై...
ఎన్టీఆర్ మరణం మీద లక్ష్మీపార్వతి సీబీఐ విచారణ కోరితే చంద్రబాబు ఎందుకు విచారణకు ఆదేశించలేదన్నారు. ఎన్టీఆర్ మరణంపైన కూడా ఒక పుస్తకం రాయాలి కదా? అని ఎద్దేవా చేశారు. సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్ ఒక వర్గం మీడియాక మాత్రమే ఎందుకు వచ్చిందన్నారు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుంటే ఆయన ఫోన్ ను తెలంగాణ పోలీసులకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కోడెల ఫోన్ ను ఎవరు ధ్వంసం చేయాలో చెప్పాలన్నారు. కోడెల మరణంపై చంద్రబాబు సీబీఐ దర్యాప్తును ఎందుకు కోరలేదన్నారు. నందమూరి ఆడపడుచు ఉరి వేసుకుని చనిపోతే దాని మీద సీబీఐ ఎంక్వైరీ ఎందుకు కోరలేదన్నారు. సీబీఐని రాష్ట్రంలో రాకుండా నిషేధించింది చంద్రబాబు కాదా? అని నాని ప్రశ్నించారు.


Tags:    

Similar News