JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ .. నా కాళ్లు పట్టుకుని.. బస్సులు రిపేర్ చేయించాల్సిందే
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నది ఐఏఎస్, ఐపీఎస్ లేనని అన్నారు. గత ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందన్నారు. తనను, తన కుటుంబ సభ్యులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నారు. పేర్నినాని, సీతారామాంజనేయులు, రవాణాశాఖ ప్రసాదరావులు తమను వేధించారని అన్నారు. తన బస్సులను సీజ్ చేయడంపై పది రోజుల్లో విచారణ జరిపించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
ఎవరినీ వదలిపెట్టనంటూ...
బస్సులు సీజ్ చేసిన విషయంలో తాను ఎవరినీ వదిలిపెట్టబోనని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బ్రేక్ ఇన్స్‌పెక్టర్లు తన కాళ్లు పట్టుకుని నా బస్సులను మరమ్మత్తులు చేయాల్సిందేనని అన్నారు. మమ్మల్ని జైలుకు కూడా పంపారన్నారు. తాను ఈ ప్రభుత్వాన్ని,చంద్రబాబును ఏమీ అనట్లేదని, చంద్రబాబుకు తాను వ్యతిరేకం కాదన్న జేసీ ప్రభకార్ రెడ్డి తన వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనుకుంటే పదవులకు రాజీనామా చేస్తానని తెలిపారు. తనకు అన్యాయం జరిగిందని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు.