భారీగా తగ్గిన బంగారం ధర

బంగారం ధరలు దేశ వ్యాప్తంగా భారీగానే తగ్గింది. పది గ్రాముల బంగారంపై మూడు వందల రూపాయలు తగ్గింది.

Update: 2022-01-26 01:54 GMT

బంగారం పెట్టుబడిగానే చూస్తారు. ఆభరణాల రూపంలో కొనుగోలు చేసినప్పటికీ మహిళలు ఎక్కువగా దానిని పొదుపు చేయడంలో భాగంగానే చూస్తారు. అందుకే భారత్ లో పసిడికి అంత డిమాండ్. ఇక పెళ్లిళ్లు, పేరంటాళ్లకు బంగారం కొనుగోళ్లు షరా మామూలుగా మారతాయి. దీంతో బంగారానికి సీజన్ తో నిమిత్తం లేకుండా డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకుల మేరకు ధరల్లో హెచ్చు తగ్గులున్నప్పటికీ బంగారం కొనుగోళ్లు ఎప్పుడూ మందగించవని మార్కెన్ నిపుణులు చెబుతుంటారు.

వెండి కూడా.....
తాజాగా బంగారం ధరలు దేశ వ్యాప్తంగా భారీగానే తగ్గింది. పది గ్రాముల బంగారంపై మూడు వందల రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 45,750 రూపాయలుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 49,750 రూపాయలుగా ఉంది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర 68,300 రూపాయలుగా తగ్గింది. కిలోకు రూ.700 లవరకూ తగ్గింది.


Tags:    

Similar News