Ys Jagan : సుప్రీంకోర్టు తీర్పుతో సీనియర్ నేతలో జగన్ భేటీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన నేతలతో చర్చిస్తున్నారు. నిన్నటి వరకూ మన వాదన వినిపించినా అది పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదన్న అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తమయినట్లు తెలిసింది. కల్తీ జరగలేదని చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తో న్యాయం జరగదని భావించి సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు ఈ సందర్భంగా జగన్ నేతలతో అన్నారని తెలిసింది.
స్వతంత్ర దర్యాప్తునకు...
అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించడం కొంత సానుకూలమైన అంశమని, ఈ విషయంపై నిజానిజాలు తేలేందుకు సాధ్యమవుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. లడ్డూలో కల్తీ జరిగిందని ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ పార్టీపై బురద జల్లేందుకు చంద్రబాబు ప్రయత్నించారని, పవన్ కల్యాణ్ అందుకు వంతపాడుతున్నారని, ఈ దర్యాప్తుతో వారి నిజరూపం అందరికీ తెలిసే అవకాశముందని కూడా జగన్ అన్నట్లు సమాచారం. ఈ సమావేశానికి బొత్స సత్యనారాయణ, కన్నబాబుతో పాటు మరికొందరు నేతలు హాజరయ్యారు.