Breaking : తిరుమల లడ్డూ వివాదం - స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశం

తిరుమల లడ్డూ కల్తీపై నేడు సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమయింది. సీబీఐ డైెరెక్టర్ నేతృత్వంలో దర్యాప్తు జరగాలని సూచించింది

Update: 2024-10-04 05:44 GMT

తిరుమలలో లడ్డూ కల్తీపై నేడు సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమయింది. సొలిసిటర్ తుషార్ మెహతా తమకు సిట్ దర్యాప్తుపై ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. సిట్ సభ్యులపై తమకు ఎలాంటి సందేహాలు లేవని తెలిపారు. టీటీడీ తరుపున సిద్ధార్థ లూథ్రా తన వాదనలను వినిపించారు. కేంద్ర అధికారి పర్యవేక్షణ ఏర్పాటు చేస్తే మంచిదని కూడా తుషార్ మెహతా సూచించారు. అయితే సీబీఐ నుంచి ఇద్దరు, సిట్ నుంచి ఇద్దరు సభ్యులు, ఎఫ్‌ఎస్ఎస్ఏఐ తరుపునఒక అధికారి మొత్తం ఐదు సభ్యులతో కూడిన బృందంతో దర్యాప్తు జరిపితే బాగుంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ బృందానికి సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కోరింది.

సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలోనే...
లడ్డూ కల్తీ అనేది చాలా దారుణమైన విషయమని గవాయి అన్నారు. ఇది కోట్లాది మంది భక్తులకు సంబంధించిన విషయం కాబట్టి లడ్డూ విషయంలో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయవద్దని సూచించింది. లడ్డూ కల్తీ జరిగిందని జరిగితే అది చాలా తీవ్రమైన విషయమని తెలిపింది. . తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ చేశారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి పిటీషన్లు వేశారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఈ విషయాలను కీలక అంశాలను కూడా ధర్మాసనం ప్రస్తావించింది.


Tags:    

Similar News