Andhra Prdesh : ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ లో మద్యం సేవించే వారికి గుడ్ న్యూస్.. త్వరలోనే 99 రూపాయలకు క్వార్టర్ బాటిల్ అందనుంది

Update: 2024-10-22 06:15 GMT

ఆంధ్రప్రదేశ్ లో మద్యం సేవించే వారికి గుడ్ న్యూస్.. త్వరలోనే 99 రూపాయలకు క్వార్టర్ బాటిల్ అందనుంది. ఇందుకోసం ఏడు కంపెనీలు ఈ రకమైన మద్యం అందించేందుకు సిద్ధమయ్యాయి. ఈ నెలాఖరుకల్లా 99 రూపాయలకే క్వార్టర్ మద్యం అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. కొత్త లిక్కర్ పాలసీని ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టిన తర్వాత మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయని మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రాండ్లు అయితే కొత్తవి దొరుకుతున్నాయి కానీ, గత ప్రభుత్వంలో మాదిరిగానే మద్యం ధరలు చుక్కలు చూపుతున్నాయని, రెండు ప్రభుత్వాలకు పెద్దగా తేడా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

99 రూపాయలకే క్వార్టర్...
ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ మద్యం తయారీ దారులకు మరోసారి చెప్పింది. వీలయినంత త్వరగా 99 రూపాయలకే మద్యం అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఇప్పటికి సప్లయ్ అవుతున్న 99 రూపాయలకే క్వార్టర్ మద్యం సరిపడా లేదు. రోజుకు పదివేల కేసులు మాత్రమే వస్తున్నాయి. అవి వెంటనే అమ్ముడుపోతున్నాయి. అదరికీ అందుబాటులో ఉండటం లేదు. ముందు వచ్చిన వారికే అవి దొరుకుతుండటంతో మిగిలిన వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. మద్యం పాలసీపై అసహనం, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో 99 రూపాయలకే మద్యం అందుబాటులోకి రానుంది.
తెలంగాణ సరిహద్దుల్లో...
మరోవైపు లిక్కర్ దుకాణాలకు కాసుల వర్షం కురుస్తుంది. గతంలో తెలంగాణ, కర్ణాటక సరిహద్దు గ్రామాల నుంచి మద్యాన్ని తెచ్చుకుని నాణ్యమైన బ్రాండ్లను సేవించే వారు. తమకు నచ్చిన బ్రాండ్ల కోసం పొరుగు రాష్ట్ర సరిహద్దులకు వెళ్లేవారు. దీంతో తెలంగాణ సరిహద్దు వైన్ షాపుల్లో మద్యం అమ్మకాలు మొన్నటి వరకూ జోరుగా సాగేవి. టూ వీలర్లు, కార్లు వేసుకుని మరీ వెళ్లి అక్కడే తాగి వచ్చే వారు. ముఖ్యంగా ఖమ్మం, నల్లగొండ సరిహద్దులే కాకుండా మహబూబ్ నగర్ జిల్లా హైవేలపై ఉన్న దుకాణాల్లోనూ గిరాకీ తీవ్రంగా ఉండేది. అయితే ఇప్పుడు ఏపీలోనే అన్ని బ్రాండ్లు లభిస్తుండటంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక 99 రూపాయలకే మద్యం దీపావళి నాటికి వస్తే ఇక లిక్కర్ లవర్స్ ఊగిపోతారంతే.


Tags:    

Similar News