Andhra Pradesh : ఇక ఆ విద్యార్థులకు ఆ దిగులు లేదు.. వాళ్లందరీకి ఉచితం.. గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్

ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పాఠపుస్తకాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది

Update: 2024-06-19 03:22 GMT

ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పాఠపుస్తకాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠపుస్తకాలతో పాటు నోట్ బుక్స్ ను కూడా ఉచితంగా అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. జులై 15వ తేదీ నాటికి పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ బుక్స్ తో పాటు బ్యాక్ ప్యాక్ అందచేయాలని జీవో నెంబరు 28ని విడుదల చేసింది. మంత్రిగా ఇంకా బాధ్యతలను నారా లోకేష్ స్వీకరించకపోయినా ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ తో పాటు పాఠ్యపుస్తకాలు కూడా అందచేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించడంతో ఆఘమేఘాల మీద ఉత్తర్వులు జారీ అయ్యాయి.

భారంగా మారడంతో...
ఆంధ్రప్రదేశ్ లో కళాశాలలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు కొనుగోలు చేయలేక అవస్థలు పడుతున్నారు. ఆర్థికంగా వారికి భారంగా మారింది. గత ప్రభుత్వం కేవలం పాఠశాల విద్యార్థులకు మాత్రమే పాఠ్యపుస్తకాలను, నోట్ బుక్స్ ను పంపిణీ చేయాలని, కళాశాల విద్యార్థులకు నిలిపేయాలని ఆదేశించింది. అయితే దీనిపై సమీక్ష నిర్వహించిన నారా లోకేష్ అందరికీ ఉచితంగా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయాలని, దాంతో పాటు నోట్ బుక్స్ కూడా ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇందులో చదివే వారికే...
దీంతో కళాశాల విద్యార్థులందరికీ ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడానికి ఉన్నత విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. ఉత్తర్వులు కూడా వెలువడటంతో అందరికీ ఉచితంగా పంపిణ ీచేసేందుకు సిద్ధమయింది. ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న వారందరీకీ ఉచితంగా పాఠ్యపుస్తకాలను, నోట్ బుక్స్ ను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ కళాశాలలు, కస్తూరీబా గాంధీ బాలిక విద్యాలయాలు, ఏపీ రెసిడెన్షియల్ కళాశాలల్లో చదువుతున్న దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులకు పన్నెండు నోటు పుస్తకాలతో పాటు పాఠ్య పుస్తకాలను కూడా ప్రభుత్వం ఉచితంగా అందచేయనుంది. వీరికి బ్యాగ్ లు కూడా అందచేయనున్నారు.







Tags:    

Similar News