ఏపీ లో ప్రభుత్వ సెలవులు ఇవే
పండగలు, జాతీయ సెలవులను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది
పండగలు, జాతీయ సెలవులను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీ తేదీలలో మార్పులు చేసింది. జనవరి 14, 15,16 తేదీల్లో సంక్రాంతి సెలవులను సాధారణ సెలవుల్లో పేర్కొంది. మార్చి 22న ఉగాది సెలవును ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
శని, ఆదివారాలు...
భోగి, సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి, రెండో శనివారం ఆదివారం వచ్చాయని ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల నోటిఫికేషన్ లో ప్రభుత్వం పేర్కొంది. వచ్చే ఏడాది అంటే 2023 లో మొత్తం 23 రోజులను సాధారణ సెలవుదినాలుగా పేర్కొంటూ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది.