ఉద్యమ విరమణ ప్రకటన నేడు వస్తుందా?
ఉద్యోగులను సమ్మె ఆలోచన నుంచి విరమింప చేయాలని ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది.
ఉద్యోగుల సమ్మెకు సమయం దగ్గర పడుతుంది. ఇక ఇరవై నాలుగు గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులను సమ్మె ఆలోచన నుంచి విరమింప చేయాలని ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. మంత్రుల కమిటీ మరోసారి పీఆర్సీ సాధన సమితి సభ్యులతో భేటీ అయింది. ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగుల డిమాండ్లకు వేటిపై అంగీకరించారో వారికి వివరిస్తుంది. ప్రధానంగా హెచ్ఆర్ఏ ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఉండేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
ఈరోజు రాత్రికి....
హెచ్ఆర్ఏ శ్లాబులలో ప్రభుత్వం కొన్ని సవరణలను చేసింది. ఈ సవరణలను ఉద్యోగ సంఘాల ముందుంచింది. పీఆర్సీ ఫిట్ మెంట్ మాత్రం 23కే ఫిక్స్ అవుతామని చెప్పినట్లు తెలిసింది. అలాగే రికవరీ వంటి ఆలోచనలను కూడా ప్రభుత్వం చేయదని తెలిపింది. ఈరోజు సమ్మె విరమణ ప్రకటనను ఉద్యోగుల చేత చేయించాలని మంత్రుల కమిటీ పట్టుదలగా ఉంది. ఉద్యోగ సంఘాల నేతలు కూడా ప్రభుత్వం ఉంచిన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు. మరికాసేపట్లో దీనిపై ఒక ప్రకటన వెలువడే అవకాశముంది.