Vallabhaneni Vamsi : నేడు వంశీ బెయిల్ పిటీషన్ పై విచారణ
నేడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ పై విచారణ జరగనుంది;

నేడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ పై విచారణ జరగనుంది. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో ఈ వంశీ బెయిల్ విచారణ చేపట్టనున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసిన సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించారన్న ఆరోపణలపై వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు.వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
కస్టడీ పిటీషన్ పై...
వల్లభనేని వంశీ పై దీంతో పాటు అనేక కేసులు నమోదయయ్యాయి. ముఖ్యంగా మైనింగ్, అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపారంటూ గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వల్లభనేని వంశీని తమ కస్టడీకి అప్పగించాలని కూడా పోలీసులు పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై కూడా నేడు న్యాయస్థానం విచారణ జరపనుంది.