Pinnelli : నేడు పిన్నెల్లి బెయిల్ పై విచారణ
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటీషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.;
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటీషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తాను హైకోర్టు విధించే షరతులకు లోబడి ఉంటానని, తనకు బెయిల్ ఇప్పించాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
నెల్లూరు జైలులో...
దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. మాచర్లలో జరిగిన ఘటనలలో పిన్నెల్లి ప్రమేయం ఉందని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన గత కొద్ది రోజుల నుంచి నెల్లూరు జైలులోనే ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటీషన్ వేసినా అందుకు హైకోర్టు సమ్మతించలేదు. మరి ఈరోజు బెయిల్ పై ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.