ఇంత పెద్ద చేప.. ఎప్పుడూ చూడలేదే...?

భారీ చేప ఒకటి మత్య్యకారుల వలలో పడింది. దీని బరువు 1500 కిలోలుగా గుర్తించారు

Update: 2024-07-29 04:43 GMT

మత్స్యకారులకు వలలో చేపలు పడటం సహజమే. అయితే సాధారణంగా చేపల వేటలో అనుకోకుండా ఒక్కోసారి భారీ చేపలు వలలో చిక్కుకుంటాయి. అయితే భారీ చేప ఒకటి మత్య్యకారుల వలలో పడింది. దీని బరువు 1500 కిలోలుగా గుర్తించారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం గిలకలదిండి వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లకు ఈ చేప చిక్కింది.

చెన్నైకి చెందిన...
అయితే దీనిని మత్స్యకారులు బయటకు తెచ్చేందుకు సాధ్యపడలేదు. దీంతో ప్రత్యేకంగా క్రేన్ ను తెప్పించి మరీ దాని సాయంతో ఈ చేపను బయటకు తీశారు. దీనీని టేకు చేపగా గుర్తించారు. అయితే ఈ టేకు చేపను చెన్నైకు చెందిన వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. ఇంత పెద్ద చేపను చూసేందుకు స్థానికులు సముద్ర తీరం వద్దకు రాగా, వ్యాపారులు కూడా అధిక సంఖ్యలో వచ్చి కొనుగోలు చేయడానికి ఉత్సాహపడ్డారు.


Tags:    

Similar News