YSRCP : వైసీపీలో చేరిన టీడీపీ నేత

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్టువర్ధన్‌ రెడ్డి చేరారు;

Update: 2024-04-04 07:18 GMT
YSRCP : వైసీపీలో చేరిన టీడీపీ నేత
  • whatsapp icon

వైఎస్ జగన్ బస్సు యాత్రలో చేరికలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఎద్దల చెరువు వద్ద బస్సుయాత్రలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్టువర్ధన్‌ రెడ్డి చేరారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అనుచరులుతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

పార్టీ బలోపేతం అవుతుందని...
విష్ణువర్దన్ రెడ్డి రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. 2019లో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున విష్టువర్ధన్‌ రెడ్డి పోటీచేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్ధి వి విజయసాయిరెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.


Tags:    

Similar News