తిరుమలలో తగ్గిన హుండీ ఆదాయం
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 1.95 కోట్ల రూపాయలు వచ్చింది. ఇటీవల కాలంలో హుండీ ఆదాయం తక్కువగా రావడం ఇదే తొలిసారి
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 35 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శ్రీవారి దర్శనానికి పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. రూ.300లు ప్రత్యేక దర్శనం టిక్కెట్ కొనుగోలు చేసిన వారికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది.
పది గంటలు...
నిన్న తిరుమల శ్రీవారిని 63,579 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,524 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 1.95 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో హుండీ ఆదాయం అతి తక్కువగా రావడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు.