సీనియారిటీయే పదవి తెచ్చిపెట్టింది
ఎస్సీ కోటాలో పినిపె విశ్వరూప్ కు మరోసారి మంత్రి పదవి దక్కిందనే చెప్పాలి.
సీనియర్ నేత.. ఐదు సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఎస్సీ కోటాలో పినిపె విశ్వరూప్ కు మరోసారి మంత్రి పదవి దక్కిందనే చెప్పాలి. 1987లో కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పినిపే విశ్వరూప్ 2004, 2009 లో అమలాపురం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో పనిచేశారు. 2013లో వైసీపీలో చేరారు. 2014లో అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయినా, 2019 ఎన్నికల్లో అమలాపురం ఎమ్మెల్యేగా విజయం సాధించార. జగన్ తొలి మంత్రి వర్గంలోనే స్థానం దక్కించుకున్న పినిపె విశ్వరూప్ కు జగన్ మరోసారి ఛాన్స్ ఇచ్చారు. తొలి మంత్రి వర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. మరోసారి ఆయనకు అదే శాఖను కేటాయించే అవకాశముంది.