పవనూ ఏందీ కొత్త బాధ : పేర్ని నాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కామెంట్స్‌పై మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Update: 2023-04-17 08:10 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కామెంట్స్‌పై మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కొత్తగా వకీలు బాధ్యత ఈయన తీసుకున్నాడని సెటైర్ వేశారు. తెలంగాణ మంత్రులతోనూ, బీఆర్ఎస్‌తోనూ ఈ కొత్తబంధం ఏంటని ప్రశ్నించారు. పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఏమన్నాడో అసలు పవన్ విన్నాడా? అని పేర్ని నాని ప్రశ్నించారు. తెలంగాణ మంత్రి హరీశ్‌రావు రాష్ట్రాన్ని తిడితే అది వేరే ఇది అంటూ వెనకేసుకు రావడంలో అర్థముంటని ప్రశ్నించారు. తెలంగాణ మంత్రి తరుపున వకాల్తా పుచ్చుకుని పవన్ కల్యాణ్ కిరాయి మాటలు మాట్లాడుతున్నారని పేర్ని నాని ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ తన వల్లే ఆగిందని బిల్డప్ ఇచ్చే ప్రయత్నం పవన్ కల్యాణ్ హడావిడిగా చేశారని, కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ ఆగదని చెప్పిన తర్వాత ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.

ఎవరికి వార్నింగ్?
ఇక్కడ వ్యాపారాలు అక్కరలేదా? అని ఎలా ప్రశ్నిస్తావన్నారు. గతంలో చంద్రబాబు, లోకేష్‌ను అంటే వెనుకేసుకు వచ్చేవాడివని, ఇప్పుడు టీఆర్ఎస్‌తో ఏం బంధమని ఇప్పుడు వారికి వత్తాసు పలుకుతున్నావని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ మమకారం ఎందుకు అని ప్రశ్నించారు. ఏపీ మీద మమకారం లేని పవన్ ఇక్కడ రాజకీయాలు చేయడానికి తగడని పేర్ని నాని అన్నారు. సందట్లో సడేమియా రాజకీయాలు చేయవద్దంటూ పవన్ కల్యాణ్‌కు పేర్ని నాని హితవు పలికారు. కన్న తల్లి లాంటి ఏపీని విమర్శిస్తే ఊరుకోవాలా? అని నాని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను అవమానపర్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేయడమేంటని పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను పేర్ని నాని ప్రదర్శించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కేసు తప్పు దోవపడుతుందన్నారు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగి సునీత కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.


Tags:    

Similar News