శ్రీశైలంలో చిరుత.. కుక్కలు తరమడంతో?
శ్రీశైలంలో చిరుత సంచారం కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద అర్ధరాత్రి చిరుత సంచారాన్ని అక్కడి సిబ్బంది గమనించారు.
చిరుతలు నగరాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అడవుల్లో ఉండాల్సిన జంతువులు మైదానం ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నాయి. తాజాగా శ్రీశైలంలో చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీశైలం లోని టోల్ గేట్ వద్ద అర్ధరాత్రి చిరుత సంచారాన్ని అక్కడి సిబ్బంది గమనించారు. భయపడిపోయిన సిబ్బంది అటవీ అధికారులకు సమాచారం అందించారు. అయితే చిరుతను చూసిన కుక్కలు వెంట పడటంతో అది అడవుల్లోకి పారిపోయింది.
భయం భయంగా...
టోల్ గేట్ వరకూ చిరుత రావడంతో దేవస్థానం ఆలయ సిబ్బంది భయభ్రాంతులకు లోనవుతున్నారు. చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినా మరలా వస్తుందేమోనని భయంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు మాత్రం చిరుత కోసం వెదుకులాట ప్రారంభించారు. భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని, చీకటి పడిన తర్వాత బయట ఎక్కువగా తిరగవద్దని సూచిస్తున్నారు.