వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ ఇంట్లో నాటుబాంబులు
వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ బోయ మధు ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంకులో రెండు కవర్లలో చుట్టిన 20 నాటుబాంబులు..;
ఉమ్మడి కర్నూలు జిల్లాలో నాటు బాంబులు మరోసారి కలకలం రేపాయి. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనుచరుడు, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ బోయ మధు ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంకులో రెండు కవర్లలో చుట్టిన 20 నాటుబాంబులు లభ్యమయ్యాయి. పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంక్ లో రెండు కవర్లలో ఈ బాంబులను గుర్తించారు. ట్యాంక్ ను క్లీన్ చేస్తుండగా ఇవి బయటపడ్డాయి. విషయం తెలిసిన వెంటనే మధు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాంబులను అక్కడ ఎవరు ఉంచారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మధును స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు. బాంబులను చూసిన వెంటనే మధుతో పాటు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యామన్నారు.