వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.;
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రేపు శ్రీలంకలో తీరం దాటే అవకాశముందని చెబుతున్నారు. ఈ వాయుగుండం ప్రభావంతో నిన్నటి నుంచే ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడులోని కరైకల్ కు 820 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం నటి సాయంత్రానికి పశ్చిమ దిశగా పయనించి తర్వాత దిశను మార్చుకుని రేపటికి శ్రీలంకలో తీరం దాటనుంది.
ఈ ప్రభావంతో...
ఈ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశముంది. రాయలసీమలోనూ అక్కడక్కడా వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది. రానున్న 24 గంటల్లో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం ఓడరేవుల్లో ఒకటో నెంబరు హెచ్చరికను జారీ చేశారు.