ఏపీకి ఎల్లో అలర్ట్
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.;
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వాయువ్య దిశగా గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. చెన్నైకి దగ్గరలో వాయుగుండం కేంద్రీకృతమయింది. ఈ ప్రభావంతో తమిళనాడుతో పాటు ఆంధ్రప్రవదేశ్ లోని, నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముంది.
బలమైన గాలులు...
నెల్లూరుకు తూర్పున 225 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో తీరం వెంట బలమైన గాలులు వీచే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు సముద్రంలో చేపట వేటకు వెళ్లొద్దని ఇప్పటికే వాతావరణ శాఖ సూచించింది. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.