తుగ్లక్ ను మించి పోయిన జగన్
వైఎస్ జగన్ తుగ్లక్ ను మించి పోయారంటూ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు
వైఎస్ జగన్ తుగ్లక్ ను మించి పోయారంటూ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు. తుగ్లక్ చర్యల్లో మరో మైలురాయి దాటారంటూ మండిపడ్డారు. తాను పెంచిన విద్యుత్ చార్జీలపై తానే ధర్నాకు పిలుపునిచ్చారని గొట్టిపాటి ఫైర్ అయ్యారు. ట్రూ అప్ చార్జీల భారం కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డివేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి గా జగన్ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయని ఆయనఅన్నారు. పీపీఏల రద్దు, సోలార్, విండ్ పెట్టుబడిదారులను బెదిరించి విద్యుత్ లోటుకు కారణం జగన్ అని గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
జగన్ హయాంలోనే...
జగన్ హయాంలోనే ఏపీ జెన్కో సర్వనాశనం అయిందని, రెండేళ్ల క్రితమే విద్యుత్ చార్జీలు పెంచాలని జగన్ రెడ్డి ఈఆర్సీని కోరారని, ఈరోజు ప్రజలను తప్పుదోవ పట్టించేలా కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు జగన్ చేయడం విడ్డూరంగా ఉందని గొట్టిపాటి అన్నారు. జమన్ హయాంలోనే వసూళ్లకు డిస్కంలు అనుమతి కోరాయని, దానిని వాయిదా వేస్తూ... కమిషన్ ముగిసే మూడు రోజుల ముందుగా వసూళ్లకు ఆదేశాలు జారీ చేశారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now