Tirumala : తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి టైం స్లాట్ టోకెన్లు
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని భావించి అందుకు అవసరమైన టోకెన్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. జనవరి నెల 10, 11,12 తేదీల్లలో దర్శనం చేసుకునేందుకు వీలుగా వచ్చే నెల 9వ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి టోకెన్లు ఇవ్వనున్నారు. దాదాపు 1.20 లక్షల టోకెన్లు సామాన్యులకు అందించనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
టోకెన్లు....
తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల్లో 87 కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తిరుమలలో ఒక కేంద్రంలో నాలుగు కౌంటర్లు ఉంటాయని, మొత్తం 91 కౌంటర్లలో ఈ దర్శనం టిక్కెట్లను జారీ చేయనున్నట్లు తెలిపారు. భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందవచ్చు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం వచ్చే నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ ఉంటుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ