Ys Jagan : నేడు పులివెందులలో ప్రజా దర్బార్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు పులివెందులలోని తన నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.

Update: 2024-12-26 03:50 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు పులివెందులలోని తన నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలను కలుసుకుంటారు. వారి నుంచి వినతి పత్రాలను తీసుకుంటారు. వారి సమస్యలను పరిష్కరించడానికి అధికారులకు సూచనలు చేస్తారు. దీంతో పులివెందుల లోని జగన్ నివాసానికి పెద్దయెత్తున జనం, కార్యకర్తలు వచ్చారు.

నాలుగు రోజుల నుంచి...
ఈ నెల 24వ తేదీన పులివెందులకు వచ్చిన జగన్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నిన్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్ నేడు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రేపు కూడా జగన్ పులివెందులలో ఒక వివాహానికి హాజరైన అనంతరం ఆయన బెంగళూరు బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అధిక సంఖ్యలో జనం రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ 


 


Tags:    

Similar News