ఏపీలో కూలీలకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లోని ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది
ఆంధ్రప్రదేశ్ లోని ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఉపాధి హామీ కూలీలకు కూలీ పెంచేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉపాధి కూలీలకు 263 రూపాయలు చెల్లిస్తున్నారు.
రోజుకు మూడు వందలు...
అయితే ఈ మొత్తాన్ని ఇక నుంచి రోజుకు మూడు వందల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఏపీలో ఉపాధి హామీ పథకం కింద అనేక పనులకు జరుగుతుండటంతో పాటు అనేక మందికి ఉపాధి అవకాశాలు కలుగుతుండటంతో రోజు వారీ వేతనం పెంచే ప్రతిపాదనను యోచించడం తీపి కబరుగానే భావిస్తున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ