బాధలు చెప్పుకోడానికే కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చాను: నారా భువనేశ్వరి
బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి
బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి. సెప్టెంబర్ 10న చంద్రబాబు, భువనేశ్వరిల వివాహ వార్షికోత్సవం. చంద్రబాబుతో కలిసి దర్శించుకోవాలని భువనేశ్వరి భావించారు. చంద్రబాబు అరెస్ట్‌తో ఈరోజే దుర్గగుడికి వెళ్లారు భువనేశ్వరి. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ఆమె దర్శించుకున్న అనంతరం తన సోదరుడు రామకృష్ణతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఒక బిడ్డకు మనసు బాగో లేనప్పుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్తాడు. అందుకే విజయవాడ కనకదుర్గమ్మకు నా బాధను చెప్పుకోవడానికి వచ్చానని అన్నారు. అమ్మవారి ఆశీర్వచనం కోసం ఇక్కడకు వచ్చానన్నారు. అమ్మవారిని నేను కోరింది ఒకటే. మా ఆయన చంద్రబాబును రక్షించమని, ఆయనకు మనోధైర్యం ఇవ్వాలని కోరుకున్నానన్నారు. ఆయన పోరాటం ఆయన ఒక్కరి కోసమో, ఆయన కుటుంబం కోసమో కాదు. ఆయన పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం అని తెలిపారు. నేను ఒక్కటే కోరుతున్నా... మీ అందరి కోసం చంద్రబాబు చేస్తున్న పోరాటం దిగ్విజయం కావడానికి అందరూ చేయిచేయి కలపాలని భువనేశ్వరి అన్నారు.