కోడికత్తి కేసులో బిగ్ ట్విస్ట్

కోడి కత్తి కేసులో సీఎం వైఎస్‌ జగన్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ కేసులో ఎన్‌ఐఏ ఇప్పటికే చాలా దర్యాప్తు చేయగా, ఈ కుట్ర కోణంపై మరింత లోతుగా

Update: 2023-07-25 12:51 GMT

కోడి కత్తి కేసులో సీఎం వైఎస్‌ జగన్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ కేసులో ఎన్‌ఐఏ ఇప్పటికే చాలా దర్యాప్తు చేయగా, ఈ కుట్ర కోణంపై మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ తరఫు లాయర్‌ దాఖలు పిటిషన్‌ని దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ని విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు కొట్టివేసింది. విచారణ సమయంలో ఇరు వర్గాల వాదనలు విన్న ఎన్ఐఏ కోర్టు జగన్ పిటిషన్‌లో పస లేదని కొట్టివేసింది. అలాగే పర్సనల్‌ అటెండెన్స్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీఎం జగన్‌ జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆగస్టు 1వ తేదీన విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.

మరో వైపు కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాస్‌ నాలుగేళ్లుగా జైల్లోనే ఉన్నాడు. అతడికి బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ని కూడా వచ్చే నెల 1వ తేదీనే విచారణ చేపడతామని ఎన్‌ఐఏ కోర్టు ధర్మాసనం తెలిపింది. 2018 అక్టోబర్ నెలలో విశాఖపట్నం ఎయిర్ పోర్టులో నాటి ప్రతిపక్షనేత జగన్‌పై హత్యాయత్నం జరిగింది. అప్పుడు ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. జగన్ విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వచ్చిన సమయంలో అక్కడి క్యాంటీన్‌లో పనిచేసే శ్రీను అనే వ్యక్తి వీఐపీ లాంజ్‌లోకి వెళ్లి టీ, కాఫీలు అందించే ఉద్దేశంతో కోడికత్తితో దాడికి పాల్పడ్డాడు. అయితే వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం నిందితుడు శ్రీనివాస్‌ రాజమహేంద్రవరం జైల్లో ఉన్నాడు. విజయవాడ ఎన్ఐఏ కోర్టులో రెగ్యులర్ విచారణకు ఇబ్బందిగా మారిందని నిందితుడి తరఫు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై న్యాయమూర్తి.. జైలు సూపరింటెండెంట్‌ని వివరణ కోరారు. రాజమహేంద్రవరం జైల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఎన్‌ఐఏ కేసులో రిమాండ్‌లో ఉన్న ఖైదీకి జైలు నుంచే విచారణ సాధ్యం కాదని జైలు సూపరింటెండెంట్‌ కోర్టుకు తెలిపారు. కాగా కోడికత్తి కేసుకు సంబంధించి గతంలోనే విచారణ పూర్తి చేసిన ఎన్‌ఐఏ.. ఈ దాడిలో ఎలాంటి కుట్ర కోణం లేదని తేల్చింది. ఎన్నికల్లో సానుభూతి కోసమే సీఎం జగన్‌ అలా చేశాడని పేర్కొంది. 

Tags:    

Similar News