శ్రీవారి దర్శనం సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. బుధవారమైనా భక్తుల రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. బుధవారమైనా భక్తుల రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి బయట టీబీసీ వరకూ క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి ఈరోజు 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని చెప్పారు.
ఇతర రాష్ట్రాల నుంచి....
నిన్న తిరుమల శ్రీవారిని 68,467 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,506 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.67 కోట్ల రూపాయలు వచ్చిందని తిుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి భక్తుల సంఖ్య ఎక్కువగా వస్తుండటంతో వీకెండ్ కాకపోయినా రద్దీ పెరుగుతుందని అంటున్నారు.