Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంది. రద్దీ కొనసాగుతూనే ఉంది.

Update: 2024-10-11 02:47 GMT

tirumala darshan

తిరుమలలో భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంది. రద్దీ కొనసాగుతూనే ఉంది. అయితే గత వారం రోజుల నుంచి పోలిస్తే ఈరోజు కొంత భక్తుల సంఖ్య తగ్గిందనే చెప్పాలి. దసరా పండగ కావడంతో భక్తుల రాక కూడా తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇటీవల కొన్ని రోజుల పాటు భక్తుల సంఖ్య అధికంగా ఉంది. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి బయట వరకూ క్యూ లైన్‌లు విస్తరించేవి. తిరుమలలో నిల్చునేందుకు కూడా చోటు దక్కే స్థలం ఉండేది కాదు. వసతి గృహాలు కూడా దొరకడం కష్టంగా మారింది. ఎక్కడ చూసినా రద్దీ కనిపించేది. కానీ ఈరోజు మాత్రం కొంత భక్తుల సంఖ్య తగ్గిందని చెప్పాలి. దసరా పండగను ఇంటి వద్ద జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మాత్రమే తిరుమల చేరుకుని స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారని అధికారులు వెల్లడించారు.

26 కంపార్ట్‌మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 60,775 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,288 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.88 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నందున స్థానికులతో పాటు తమిళనాడు నుంచి ఎక్కువ మంది భక్తులు తిరుమలకు వస్తున్నారని అధికారులు తెలిపారు. స్వామి వారి దర్శనం కూడా పెద్దగా వెయిట్ చేయకుండానే అవుతుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News