తిరుమలలో ఈరోజు దర్శన సమయం?

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.71 కోట్ల రూపాయలు అని అధికారులు వెల్లడించారు.

Update: 2022-09-20 02:28 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 24 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. వీరికి దర్శన సమయం 12 గంటలు పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. నిన్న శ్రీవారిని 67,276 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,140 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.71 కోట్ల రూపాయలు అని అధికారులు వెల్లడించారు. రూ. 300ల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి మూడు గంటల నుంచి నాలుగు గంటల దర్శన సమయం పడుతుంది.

రేపు టోకెన్ల విడుదల...
రేపు నవంబర్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు ఆన్ లైన్ కోటాను టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 9 గంటల నుంచి టీటీడీ వెబ్‌సైట్ లో ఈ టిక్కెట్లను విడుదల చేయనుంది. నవంబరు నెలలోనే ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవ ఆర్జిత సేవా టిక్కెట్లు రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉండనున్నాయి. అంగప్రదిక్షిణం అక్టోబు నెల టోకెన్లకు సంబంధించి ఈ నెల 22న అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగే అక్బోబరు 1నుంచి ఐదో తేదీ వరకూ అంగ ప్రదిక్షణ టోకెన్లు ఉండవు. ఆ తేదీల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి ఉండవని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News