Andhra Pradesh : పంచాయతీలకు పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.;

Update: 2024-08-21 02:08 GMT

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థలకు ఊతమిచ్చే దిశగా నిధుల విడుదలకు గుడ్ న్యూస్ చెప్పారు. స్థానిక సంస్థలకు 1,452 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం పదిహేనో ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసిన సందర్భంగా గ్రామ పంచాయతీలకు 998 కోట్ల రూపాయలను కేటాయిస్తూ పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఇక మున్సిపాలిటీలు పరిధిలో 454 కోట్లు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

స్థానిక సంస్థకు నిధులను...
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. గత ప్రభుత్వం స్థానిక సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను ఇతర పనులకు వినియోగించగా, తమ ప్రభుత్వం మాత్రం వాటిని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ నిధుల విడుదల వల్ల స్థానిక సంస్థల్లో కొన్ని అభివృద్ధి పనులు చేపట్టే అవకాశముంది.


Tags:    

Similar News