మోదీతో జగన్ లంచ్ మీటింగ్

నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి హాజరైన ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా లంచ్ కు ఆహ్వానించారు

Update: 2022-08-08 08:43 GMT

నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి హాజరైన ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా లంచ్ కు ఆహ్వానించారు. లంచ్ దాదాపు గంట సేపు సాగింది. ఈ లంచ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధానికి వివరించినట్లు తెలిసింది. ప్రధాని మోదీ కూడా సమస్యల పరిష్కారానికి సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశాన్ని ప్రస్తావించినప్పుడు తాను వాటిని పరిశీలించి విడుదల చేస్తానని జగన్ మోదీకి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

ప్రాధాన్యత ఇచ్చి.....
నిన్న జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకూ భోజన విరామ సమయం ఇచ్చారు. ఈ లంచ్ కు తన టేబుల్ వద్దకు జగన్ ను మోదీ ఆహ్వానించారు. మోదీతో కలసి జగన్ లంచ్ చేశారు. అతి కొద్దిమందికే ఈ ఆహ్వానం అందింది. అందులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఒకరున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ జగన్ కు ప్రాధాన్యత ఇవ్వడంతో రాష్ట్రంలోని అనేక సమస్యలు కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయని వైసీపీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.


Tags:    

Similar News