వ్యవసాయ పరిశోధనలు అందరికీ చేరాలి

వ్యవసాయాన్ని ప్రపంచమంతా అందరికీ చేరవేయడంలో ఇక్రిశాట్ కృషి ఎంతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు

Update: 2022-02-05 11:45 GMT

వ్యవసాయాన్ని ప్రపంచమంతా అందరికీ చేరవేయడంలో ఇక్రిశాట్ కృషి ఎంతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇక్రిశాట్ లో ఆయన శాస్త్రవేత్తలతో కాసేపు ప్రసంగించారు. వ్యవసాయానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. డిజిటిల్ విధానంలో వ్యవసాయంలో మెలుకువలను నేర్పడం ఎంతో ప్రయోజనకరమని మోదీ అభిప్రాయపడ్డారు. పంట దిగుబడి పెరగడానికి అవసరమైన పరిశోధనలు మరింతగా కొనసాగించాలని మోదీ పిలుపు నిచ్చారు.

పంట దిగుబడిని కాపాడేందుకు....
తమ ప్రభుత్వం కూడా పంట దిగుబడిని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పంటను నిల్వ చేసుకునేందుకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తున్నట్లు మోదీ తెలిపారు. దేశంలో ఎనభై శాతం మంది రైతులే ఉన్నారని, వారందరికీ కేంద్ర ప్రభుత్వం అండగా ఉందని చెప్పారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ లు పాల్గొన్నారు. ఇక్రిశాట్ లోగోతో పాటు స్వర్ణోత్సవాల సందర్భంగా రూపొందించిన పోస్టల్ స్టాంప్ ను మోదీ విడుదల చేశారు.


Tags:    

Similar News