Narendra Modi : మోదీ నోట పవన్ మాట.. ఎన్డీఏ సమావేశంలో పీకే ప్రస్తావన
ప్రధాని నరేంద్ర మోదీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ప్రధాని నరేంద్ర మోదీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎన్డీఏ ఎంపీల భేటీలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందే కూటమి ఏర్పడి మూడోసారి విజయం సాధించామని తెలిపారు. కూటమి విజయం సాధించడంలో పవన్ కల్యాణ్ లాంటి వారు కూడా ఉన్నారని ఆయన ప్రస్తావించారు. ఎన్డీఏ అంటేనే సుపరిపాలన అని జనం మరోసారి పట్టం కట్టారన్నారు. విజయవంతమైన భాగస్వామ్యమని ఆయన తెలిపారు. గతమూడు దశాబ్దాల్లో ఈ కూటమి మూడుసార్లు ఐదేళ్లు పాలన సాగించిందని తెలిపారు. ఎన్నో సంస్కరణలు తెచ్చిన ఘనత కూటమికే దక్కుతుందన్నారు.
ఎన్డీఏ అంటేనే...
మరోసారి ఐదేళ్లపాలనకు ప్రజలు అవకాశమిచ్చారన్న మోదీ ఎన్డీఏ అంటేనే దేశ అభివృద్ధి అని అన్నారు. దేశ చరిత్రలో మరొక కొత్త అధ్యాయం మొదలయిందని తెలిపారు. ఎన్నికల ముందు పెట్టుకున్న కూటమి ఇంతగా ఎన్నడూ గతంలో విజయవంతం సాధించలేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే సంఖ్యాబలం కావాలని, దేశాన్ని నడపాలంటే సర్వసమ్మతం కావాలని ఆయన అన్నారు. కూటమిలో పరస్పర విశ్సాసమే ప్రధానంగా పనిచేస్తామని తెలిపారు. ఎన్డీఏ అంటే న్యూ ఇండియా డెవలెప్‌మెంట్ ఇండియా, ఆస్పిరేషన్ ఇండియా అని మోదీఅన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ నేతలందరూ మోదీని తమ ప్రధానిగా ఎన్నుకున్నారు.