ఏపీలో ఖాళీగా ప్రభుత్వ కార్యాలయాలు
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. న్ డౌన్, యాప్ డౌన్ కార్యక్రమాలను నేడు ఉద్యోగులు కొనసాగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నా తాము ముందుగానే సిద్ధం చేసుకున్న కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించారు. ఈమేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు పెన్ డౌన్, యాప్ డౌన్ లను కొనసాగిస్తున్నారు. ఈరోజు, రేపు సహాయ నిరాకరణ చేయాలని ముందుగానే నిర్ణయించారు.
పెన్ డౌన్.. యాప్ డౌన్.....
రేపు అర్థరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నారు. ఇప్పటికే ఈ మేరకు చీఫ్ సెక్రటరీకి నోటీసులు ఇచ్చారు. అయితే నిన్న రాత్రి మంత్రుల కమిటీతో జరిగిన చర్చలు కొంత సానుకూల వాతావరణంలో జరిగాయి. ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను చాలా వరకూ పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తుంది. అయినా ముందుగా అనుకున్న కార్యాచరణ ప్రకారం పెన్ డౌన్, యాప్ డౌన్ కార్యక్రమాలను నేడు ఉద్యోగులు కొనసాగిస్తున్నారు.