RaghuRama VS Sunil: ఆయన్ను వదలని రఘురామ

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు

Update: 2024-07-12 05:39 GMT

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడంతో ఏపీ సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్‌పై కేసు నమోదైంది. 2021లో రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో విద్వేషపూరిత ప్రసంగం, కొన్ని వర్గాల్లో ఉద్రిక్తత సృష్టించడం, ప్రభుత్వ ప్రముఖులపై దాడి వంటి ఆరోపణలతో హైదరాబాద్‌లో సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఆ సమయంలో తనను కస్టడీకి తీసుకోవడమే కాకుండా తీవ్రంగా కొట్టారని, తనపై హత్యయత్నం కూడా జరిగిందంటూ గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు రఘురామరాజు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

రఘురామ అప్పట్లో వైసీపీలో ఉండి.. ఆ పార్టీని ఎంత డ్యామేజీ చేయాలంటే అంత డ్యామేజీ చేసేశారు. పార్టీని వీడకుండా.. వైసీపీ పైనా, ఆ పార్టీ పాలన పైనా ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చారు. అటు ప్రెస్ మీట్లు.. ఇటు సంచలన ప్రకటనలతో వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారారు. ఆ తర్వాతనే ఆయన అరెస్ట్ వ్యవహారం సాగింది. అప్పట్లో తనను కొట్టారంటూ రఘురామ సంచలన ఆరోపణలు చేశారు.


Tags:    

Similar News