అనకాపల్లిలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ లోని ఒక ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ఐదుగురు మృతి చెందారు

Update: 2024-08-21 12:48 GMT

అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ లోని ఒక ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ఐదుగురు మృతి చెందారు. సెజ్ లోని ఎసెన్షియా కంపెనీలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని అనకాపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణం మాత్రం తెలియరాలేదు. మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో రియాక్టర్ పేలడంతో పెద్దగా ప్రాణనష్టం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పరిశ్రమలో ిచిక్కకుపోయిన కార్మికులను కాపాడారు.

గాయపడిన వారిలో....
ఆరు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సరైన చికిత్స అందించాలని, మెరుగైన చికిత్స కోసం అవసరమైతే విశాఖకు తరలించాలని ఆదేశించారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఇంకా ఇరవై ఏడు మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News