తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో రద్దీ తగ్గింది. గత కొన్ని రోజులుగా భక్తుల రద్దీతో కొనసాగుతున్న తిరుమలలో నేడు పెద్దగా కన్పించడం లేదు.
తిరుమలలో రద్దీ తగ్గింది. గత కొన్ని రోజులుగా భక్తుల రద్దీతో కొనసాగుతున్న తిరుమలలో నేడు పెద్దగా కన్పించడం లేదు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని ఏడు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. 300 రూపాయలు కొనుగోలు చేసిన ప్రత్యేక దర్శనం భక్తులకు గంట నుంచి రెండు గంటల సమయం పడుతుందని చెప్పారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 81,523 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 37,100 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.65 కోట్ల రూపాయలుగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.