తిరుమలలో ఈరోజు క్యూలైన్ ఎంతంటే?

తిరుమలలో రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. సోమ, మంగళవారాల్లోనూ భక్తుల రద్దీ కొనసాగుతోంది.

Update: 2022-07-19 02:56 GMT

తిరుమలలో రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. సోమ, మంగళవారాల్లోనూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత నెల రోజుల నుంచి తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి గంటల కొద్దీ భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. తిరుమల నిత్యం భక్తులతో కిటకిట లాడుతుంది. కొండకు ఎంతమంది భక్తులు వచ్చినా వారికి వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తామని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

తగ్గని రద్దీ....
ఈరోజు తిరుమలలోని వైకుంఠం కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూలైన్ ఎస్ఎంసీ జనరేటర్ వరకూ కొనసాగుతుంది. ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి 9 గంటల సమయం పట్టే అవాకశముందని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 77,273 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,893 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.50 కోట్ల రూపాయలు అని అధికారులు తెలిపారు


Tags:    

Similar News