తిరుమలలో అదే రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 29 కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయి ఉన్నారు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 29 కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయి ఉన్నారు. వీరంతా శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. నడకదారిన వచ్చిన భక్తులకు సర్వదర్శనం క్యూ లైన్ లో శ్రీవారి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా సర్వదర్శనం క్యూ లైన్లోకి ప్రవేశించిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 81,833 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 33,860 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.