శనివారం అంత రద్దీ లేదే
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నేడు శనివారం అయినా భక్తుల రద్దీ పెద్దగా లేదు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నేడు శనివారం అయినా భక్తుల రద్దీ పెద్దగా లేదు. వైకుంఠం క్యా కాంప్లెక్స్‌లోని పది కంపార్ట్మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నడకదారిన వచ్చిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉదయం ఏడు గంటలకు క్యూ టోకెన్లు లేకుండా సర్వదర్శనం క్యూ లైన్లో ప్రవేశించే భక్తులు మాత్రం శ్రీవారి దర్శనం కోసం పది గంటల సమయం వేచి ఉండాల్సి ఉందని అధికారులు తెలిపారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులు మాత్రం శ్రీవారి దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 59,849 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. వీరిలో 30,097 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారని వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.72 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.