శనివారం.. ఇక తిరుమలలో రద్దీ చెప్పాలా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వీకెండ్ కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వీకెండ్ కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. ఈరోజు వైకుంఠం కాంప్లెక్స్ లోని 29 కంపార్ట్‌మెంట్లలన్నీ భక్తులతో నిండిపోయాయి. వీరు శ్రీవారిని దర్శనం చేసుకోవాలంటే 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఇక రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు నుంచి మూడు గంటల వరకూ దర్శన సమయం పడుతుంది.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 69,012 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,195 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం4.59 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి దర్శనం కల్పించడమే కాకుండా, వారికి వసతి, అన్న ప్రసాదాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు.