తిరుమల కొండ కిట కిట

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శని, ఆదివారాలు కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువయ్యే అవకాశాలున్నాయి

Update: 2022-07-30 02:37 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శని, ఆదివారాలు కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వీరికి శ్రీవారి దర్శనం అయ్యే సమయం ఎనిమిది గంటలు పట్టే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. ఈ రెండు రోజుల పాటు భక్తుల సంఖ్య మరింత పెరగనుందని, అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఆదాయం నిన్న....
నిన్న తిరుమల శ్రీవారిని 58,747 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,496 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.79 కోట్ల రూపాయలు లభించింది. గత కొద్ది రోజులుగా నాలుగు కోట్లు హుండీ ఆదాయం నిన్ననే తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వీకెండ్ కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.


Tags:    

Similar News